* వరంగల్ సీపీ అంబర్ కిశోర్ కు ఫిర్యాదు చేసిన పద్మశాలి కులస్తులు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ పద్మశాలి కులస్తులు తమ భూములు కాపాడాలంటూ సోమవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా కు ఫిర్యాదు చేశారు. సిపి అంబర్ కిషోర్ ను కలుసుకున్న బీసీ కాలనీ పద్మశాలి కులస్తులు గతంలో ప్రభుత్వం వారికి మంజూరు చేసిన చేసిన బీసీ కాలనీలోని పద్మశాలి కులానికి చెందిన భూములను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి,అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడ్నాల నరేందర్ మాట్లాడుతూ… ఇదే విషయమై గత వారం కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇవాళ సిపి అంబర్ కిశోర్ ను కలిసి ఫిర్యాదు చేశామని కాలనీ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని ఆయన కోరారు. కబ్జాదారులు ఇకనైనా కబ్జాలు మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, యువజన విభాగం అధ్యక్షులు పోరండ్ల కృష్ణ ప్రసాద్, పద్మశాలి కులస్తులు వావిలాల మురళి, వెంగళ బాలకృష్ణ, బీసీ కాలనీవాసులు పాల్గొన్నారు.
…………………………………