
* కన్సల్టెన్సీపై కేసునమోదు చేసిన పోలీసులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఓ మహిళ కాల్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. గల్ఫ్‌లో మంచి ఆఫర్ ఉందంటూ ఎమ్మెల్యేకు ఓ కన్సల్టెన్సీ మహిళ ఫోన్ చేసింది. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. మహిళ తీరుపై సదరు ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై జగిత్యాల పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కన్సల్టెన్సీ మహిళ దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో మంచి ఆఫర్స్ ఉన్నాయంటూ పలువురికి ఫోన్ కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఎలాంటి లైసెన్స్ లేకుండానే విదేశీ బ్రోకరేజీ కన్సల్టెన్సీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆఫీస్ సీజ్ చేసి, లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై కేసు నమోదు చేశారు.
…………………………………………………………