* బండి సంజయ్ ఆసక్తికర ప్రకటన
* ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదని, గత పాలకులు వెనుకబడేసిన జిల్లా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (bandi sanjay kumar)అన్నారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉందని తెలిపారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ (nitin gadkhary) హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని సూచించారు. కొమరం భీం జిల్లాలో రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. ఆదిలాబాద్ (adilabad)ఉమ్మడి జిల్లా ఒకప్పుడు వెనుకబడిన జిల్లా అని తెలిపారు. రోడ్లు, రహదారుల వ్యవస్థ ఘోరంగా ఉండేదని అన్నారు. కానీ ఇవాళ కరీంనగర్ (Karimnagar)నుంచి ఇక్కడికి గంటన్నరలోపే వచ్చానని. తెలంగాణలో ఎక్కడికైనా సరే… పొద్దున్నే పోయి పని చూసుకుని మళ్లీ సాయంత్రానికి ఇంటికి రాగలుగుతున్నామని తెలిపారు. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదని, గత పాలకులు వెనుకబడేసిన జిల్లా అని సంజయ్ విమర్శించారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
