ఆకేరు న్యూస్, ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులు ఆదివాసి ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క సారమ్మలకు మొక్కి ముడుపు కట్టి.. తల్లుల గద్దెలను దర్శించుకొని అమ్మవార్లకు పసుపు, కుంకుమ,బంగారం (బెల్లం) సమర్పించి హుండీలో కానుకలు చెల్లిస్తే భక్తునికి గుండె నిండుతుంది.
కానీ ఇది ఏఐ యుగం కదా!
కానుకల చెల్లింపులు సైతం డిజిటలైజ్ చేశారు. దేవదాయ అధికారులు దేవతల గద్దెల ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేశారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే స్కాన్ చేసి కానుకలు చెల్లించవచ్చు. కానీ నోట్లు, నాణాల,రూపంలో కానుకలు ఇవ్వడమే భక్తులకు ఇష్టం.అయితె ప్రస్తుతం భక్తులు ఏవిధంగా నైన కానుకలు చెల్లించుకునెందుకు అధికారులు ఆధునిక పోకడలు అవలంబిస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ భక్తుల సౌకర్యార్థం అన్ని వసతి ,సౌకర్యాలు అభివృద్ధి పరుస్తున్నారు.
………………………………………………………
