* గుండెలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబసభ్యులు
ఆకేరున్యూస్, చేవెళ్ల : బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డల రోదనలతో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణం మార్మోగుతోంది. వారి కన్నీళ్లకు ఆనకట్ట పడడం లేదు. గుండెలవిసేలా రోదిస్తున్న వారి తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది. ఒకే కుటుంబంలో, ఒకేసారి ముగ్గురి కుమార్తెలను పోగొట్టుకున్న ఆ తల్లి పరిస్థితి అయితే మరీ ఘోరం. తండ్రి బస్సు ఎక్కించిన కొద్ది సేపటికే వారి మృత్యు వార్త వినడం తట్టుకోలేకపోతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 19 మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 15 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాయి. చనిపోయిన వారిలో 17 మంది తాండూరు, చేవెళ్లకు చెందిన వారే కావడం గమనార్హం. బంధువులు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో చేవెళ్ల ఆస్పతిలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధితులకు వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. చేవెళ్ల ఆస్పత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు.
చనిపోయింది వీరే..
* బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా (38)
* గంగారం తండాకు చెందిన తారి బాయ్ (45)
* కల్పన (45), హైదరాబాద్ బోరబండ
* నాగమణి (55), కర్ణాటక, భానూరు
* గోగుల గుణమ్మ, హైదరాబాద్ బోరబండ
* మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాదు
* గుర్రాల అఖిల్ (21), యాలాల
* షేక్ ఖలీల్ హుసేన్, తనూష, తాండూరు
* తబుస్సుమ్ జహాన్, తాలియాబేగం, తాండూరు
* సాయిప్రియ, నందిని, ముస్కాన్, తాండూరు
* ఆకాష్, టిప్పర్ డ్రైవర్, కర్ణాటక
………………………………………………
