
ఆకేరు న్యూస్, డెస్క్ : అబ్బే మేం ఫ్రెండ్స్ మాత్రమే.. లవ్.. పెళ్లిపై ఆ జంటకు ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా వచ్చే సమాధానం ఇదే. కానీ.. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి పీటలూ ఎక్కనున్నారు. ఆ సినీ లవ్ బర్డ్స్ మరెవరో కాదు.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika). అతితక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వారు ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ వేడుక జరిగినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, సంబంధిత ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని సమచారం. చాలా మంది సెలబ్రిటీ ల్లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ (Destination Wedding Plan) చేస్తున్నారని విజయ్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వచ్చేవి. అయితే.. వారు మేం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పేవారు.
…………………………………………….