* ఏకగ్రీవంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నిక
* శాసనసభలో అధికారికంగా ప్రకటన
ఆకేరు న్యూస్, విజయవాడ : తెలుగుదేశం (TDP) ప్రభుత్వ హయాంలో కూడా ఉత్తరాంధ్ర నేతనే స్పీకర్ పదవి వరించింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ (AP Assembly Speaker) గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు (Senior MLA Chintakayala Ayyannapatrudu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ (Protem Speaker) గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Buchaiah Chaudhary) శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం అయ్యన్నను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
అయ్యన్న ప్రస్థానం ఇదే..
చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ (TDP Party) ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉన్నారు. 1983లో తొలిసారిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం (Assembly Constituency) నుంచి ఎమ్మెల్యే (MLA) గా గెలిచిన ఆయన.. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ (Umashankar Ganesh) మీద విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగానూ పనిచేసిన అయ్యన్నపాత్రుడు.. స్పీకర్ పదవిని అలంకరించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్గా తమ్మినేని సీతారాం (Thammineni Sitaram) వ్యవహరించారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రకంగా మరోసారి అసెంబ్లీ స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర వాసులను వరించింది.
—————————-