* ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. 2022, 2023లో కేంద్ర ప్రభుత్వం సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నది. రెండు సార్లు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించింది.
హన్మకొండ జిల్లాలో నిర్వహించే వేడుకలకు
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హన్మకొండ జిల్లాలో 17న నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
—————————-