– పలు రైళ్లు ప్రయాణించే స్టేషన్లు కుదింపు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట- బల్లార్ష సెక్షన్‌పై ట్రిప్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మంచిర్యాలలోని మందమర్రి స్టేషన్ వద్ద ప్రీ నాన్- ఇంటర్‌లాకింగ్, నాన్- ఇంటర్‌లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లు రద్దయ్యాయి. నేటినుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు అయ్యాయి.
* రద్దయిన రైళ్ల వివరాలు*
ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి నడిచే ట్రైన్ నెం 17003 ,17004 కాజీపేట నుండి సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రామగిరి అప్ అండ్ డౌన్ రద్దయింది.
ట్రైన్ నెం 17033, 17034 భద్రాచలం రోడ్ (BDCR) నుండి బయలుదేరి బల్హర్షా (BPQ) మధ్య నడిచే సింగరేణి అప్ అండ్ డౌన్ రద్దయింది.
17035 అజ్ని (కాజీపేట్ – బల్హర్షా ఎక్స్‌ప్రెస్) కాజీపేట్ – బల్హర్షా మధ్య నడిచే అప్ అండ్ డౌన్ రద్దయింది.
స్టేషన్లు కుదించిన రైళ్ల వివరాలు
ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి నడిచే 17011, 17012 హైదరాబాద్ నాంపల్లి – సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ మధ్య నడిచే ఇంటర్సిటీ మంచిర్యాల వరకు మాత్రమే నడవనుంది.
12757, 12758 సికింద్రాబాద్ జంక్షన్ నుండి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రామగుండం వరకు మాత్రమే నడువనుంది.
17233, 17234 సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్యన నడిచే భాగ్యనగర్ మంచిర్యాల వరకు మాత్రమే వెళ్లనుంది.
కాబట్టి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని రైల్వే అధికారులు సూచించారు.
……………………………………….
