
ఆకేరు న్యూస్, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో జనజీవనం స్తంభించింది. ములుగు జిల్లాలోని కొన్ని పర్యాటక ప్రాంతాలకు, ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడురు, కొత్తగూడ, గంగారం మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొక్కజోన్న, వరి, పత్తి పంటకు భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు.
…………………………………….