Hyderabad Shadab Hotel FSSAI License Suspended
* ఈగలు, బొద్దింకలు స్వైర విహారం
* హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో బయటపడిన నిజాలు
* ఆగమాగంగా వంటగది
* లైసెన్స్ రద్దు చేసిన అధికారులు
* ల్యాబ్‌కు పంపించిన ఆహార పదార్థాలు
* మరో 19 కేఫ్‌లు, స్నాక్ సెంటర్లలో తనిఖీలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్‌లో బిర్యానీ అంటే గుర్తొచ్చే పేర్లలో షాదాబ్ హోటల్ కూడా ఒకటి. దశాబ్దాలుగా నగరవాసుల”, హైదరాబాద్‌కు వచ్చే ఆహార ప్రియులకు ఈ హోటల్ సుపరిచితం. అలాంటి ప్రముఖ హోటల్‌పై ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. తనిఖీల్లో తీవ్రమైన ఆహార భద్రత, పరిశుభ్రత లోపాలు గుర్తించడంతో షాదాబ్ హోటల్ ఎఫఎసఎసఏఐ లైౖసెన్స్ను సస్పెండ్ చేశారు. కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
* వంటగది ఎలా ఉందంటే..
ఆహార తయారీ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు తెరిచి ఉన్న చెత్త డబ్బాలు, చెల్లాచెదురుగా పడిన చెత్తను గుర్తించినట్లు పేర్కొన్నారు. వంటగదిలో బొద్దింకలు, ఈగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాంసం, ఇతర త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం తనిఖీల్లో బయటపడినట్లు తెలిపారు. సిబ్బంది అఫ్రాన్ ధŠరించకుండా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిబ్బందికి సంబంధించిన తప్పనిసరి ఆరోగ్య రికార్డులు, శిక్షణ ధ్రువపత్రాలు, కీటక నియంత్రణ లాగ్లను యాజమాన్యం సమర్పించలేదని తెలిపారు.
* లైసెన్స్ సస్పెండ్..
ఈ లోపాలను తీవ్రంగా పరిగణించిన అధికారులు షాదాబ్ హోటల్ ఎఫఎసఎసఏఐ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. హోటల్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. తనిఖీల్లో ఆహార నాణ్యతపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో వివిధ ఆహార పదార్థాలకు సంబంధించిన 15 నమూనాలను అధికారులు సేకరించారు. టీ పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, బిస్కెట్లతో పాటు ఇతర నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. దుమ్ము, ఈగల” వాలి పాడైన ఆహార పదార్థాలను అధికారులు ధ్వంసం చేశారు.
తొమ్మిది ప్రత్యేక బృందాలు షాదాబ్ హోటల్‌తో పాటు హైదరాబాద్‌లోని 19 కేఫ్‌లు, స్నాక్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాయి. ఎఫఎసఎసఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పంజాగుట్టలోని ఏషియాటిక్ కేఫ్, బాగ్‌లింగంపల్లిలోని డ్రీమ్జ్ కేఫ్టీరియాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. బిర్యానీకి పేరుగాంచిన షాదాబ్ హోటల్ లైసెన్స్ సస్పెన్షన్ చర్చనీయాంశమైంది. ఆహార పదార్థాలు పంపిన ల్యాబ్ పరీక్షల ఫలితాలపై తదుపరి చర్యలు తీసుకోన్నుట్లు అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
