Revanth Reddy Kodangal Visit
* వివిధ అభివృద్ధి పనుల పరిశీలన
* అధికారులతో సమీక్ష
* రాత్రి బస అక్కడే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజక వర్గమైన కొడంగల్‌లో నేటి నుంచి 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు సంక్షేమ, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, నేరుగా క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించనున్నారు.
* విద్యా రంగానికి ప్రాధాన్యం..
ఈ పర్యటనలో సీఎం విద్యా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మద్దూరులో నూతనంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు. అలాగే దౌల్తాబాద్ పరిధిలో నిర్మిస్తున్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణాలతో పాటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ పనుల ప్రగతిని కూడా రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్.. కొడంగల్ నియోజకవర్గాన్ని మోడల్ విద్యా హబ్‌గా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా హకీంపేట వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఎడ్యుకేషన్ హబ” నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
* అభివృద్ధి పనులపై సమీక్ష
అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న రోడ్లు, మౌలిక వసతులు, ఇతర సంక్షేమ పథకాల పురోగతిపై జిల్లాస్థాయి అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పనుల్లో అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
* కొడంగల్‌లోనే రాత్రి బస
ఇవాళ రాత్రి కొడంగల్‌లోనే సీఎం బస చేయనున్నారు. సొంత నియోజకవర్గంలో అధినేత బస చేస్తుండటంతో స్థానిక నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కొడంగల్ వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
