* ఆర్డీఎక్స్ బాంబు ఉంచినట్లు మెయిల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అరైవల్ ప్రాంతంలో ఆర్డీఎక్స్ బాంబు ఉంచినట్లు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్లతో అనువనువు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు.దీంతో బూటకమేనని తేల్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇలాంటి బెదిరింపులే రెండు రోజుల కిందట వచ్చాయి. ఇలా వరుస బెదిరింపులతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం బెదిరింపు మెయిల్ పంపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేసి అంతా ఫేక్ అని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
