* బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా పిలుపు
ఆకేరున్యూస్ డెస్క్ : బంగ్లాదేశ్ ఎన్నికల వేళ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. ఆగస్టు 2024లో చెలరేగిన హింసాత్మక నిరసనల తర్వాత భారతదేశంలో తలదాచుకుంటున్న హసీనా బంగ్లాదేశ్ ప్రస్తుతం “భీభత్స యుగం”లోకి ప్రవేశించిందని, దేశాన్ని కాపాడుకోవడానికి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని “తోలుబొమ్మ ప్రభుత్వాన్ని” కూలదోయాలని ఆడియో సందేశం ద్వారా ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12, 2026న జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హసీనా ఐదు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు. అక్రమ యూనస్ పాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, వీధి హింసను అరికట్టడం, మైనారిటీలకు భద్రత కల్పించడం, రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆపడం, గత ఏడాది జరిగిన పరిణామాలపై ఐక్యరాజ్యసమితి చేత నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. యూనస్ నీడ తొలగే వరకు దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యం కావని ఈ సందర్భంగా షేక్ హసీనా తన సందేశంలో స్పష్టం చేశారు.
……………………………………………………………..
