
* నెక్ట్స్ ఎవరు… హస్తినకు ఆ రాష్ట్ర రాజకీయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. శివసేన (షిండే) వర్గం నుంచి ఏక్ నాథ్ షిండే(EKNATH SHINDE), బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్,(DEVENDRA PHADNAVIS) ఎన్ సీ పీ (అజిత్ పవార్ ) వర్గం నుంచి అజిత్ పవార్(AZIT PAVAR) లు సీఎం పదవి కోసం హస్తినలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ (GOVERNOR RADHAKRISHNAN)కు షిండే తన రాజీనామా లేఖను అందించారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి ఆయన రాజీనామా సమర్పించారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఏక్ నాథ్ షిండేను గవర్నర్ కోరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో సీఎం అభ్యర్ధి ఎవరనే విషయమై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం ఎవరనేది బీజేపీ(BJP) జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
………………………………………