
* సింగిల్ బెంచ్ ఆదేశాలను పక్కనబెట్టిన డివిజన్ బెంచ్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్(CONGRESS)లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు(HIGHCOURT) కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టేసింది. అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్(SPEAKER) తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో బీఆర్ఎస్కు షాక్ తగిలినట్లయింది.
………………………………………