* అఖిలపక్ష సమావేశంలో చర్చ
* మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం
ఆకేరు న్యూస్ డెస్క్ : రిజర్వేషన్ల (Reservations) పై అట్టుడికిన బంగ్లాదేశ్ (Bangladesh) లో పరిస్థితులను చక్కదిద్దేందుకు సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటోంది. సహకరించాలని రాజకీయ పార్టీలను, ఆందోళనకారులను కోరుతోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా (Sheikh Hasina) ప్రస్తుతం భారతదేశం (India) లో ఆశ్రయం పొందుతున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అత్యవసరంగా అఖిల సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవన్ (Parliament Bhavan) లో అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ముగిసింది. బంగ్లాదేశ్ పరిస్థితులను, షేక్‌హసీనాకు ఆశ్రయం కల్పించడంపై సమావేశంలో చర్చించారు. భారత్ – బంగ్లా సరిహద్దుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపింది అఖిలపక్షం. షేక్ హసీనాకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. ఈ భేటీకి అధికార పక్షం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Defense Minister Rajnath Singh), హోంశాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah), జేపీ నడ్డా (JP Nadda), కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ (Rahul Gandhi), వేణుగోపాల్M (Venugopal )తోపాటు, ఎస్పీ (SP), (టీఎంసీ) తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా మారాయి.
—————-