Rajinikanth Shriya Saran Dharman
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నటి శ్రియా శరణ్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ రీయూనియన్పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఇద్దరూ 2007లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘శివాజీ: ది బాస్’ తర్వాత మళ్లీ కలిసి తెరపై కనిపించలేదు. శ్రియా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. విమానంలో తీసినట్లుగా కనిపిస్తున్న ఈ సెల్ఫీకి ఆమె చాలా సింపుల్‌గా క్యాప్షన్ ఇచ్చారు. “When you meet the legend, Photo toh banta hai.” అని శ్రియా రాశారు.
* 19 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారా?
శ్రియా, రజనీకాంత్ కలిసి ‘ధర్మన్’ సినిమాలో నటించనున్నారనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఫొటో రావడం ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమాలో శ్రియా నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఆమె తాజా పోస్ట్‌తో 19 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి కలిసి తెరపై కనిపించనున్నారా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
* ‘ధర్మన్’లో భారీ తారాగణం
ఇక ‘ధర్మన్’ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, సిమ్రన్, యోగిబాబు కూడా నటిస్తున్నారు. జూన్‌లో కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో, రక్తంతో తడిసిన స్కాల్పెల్ చేతిలో పట్టుకుని, తన ట్రేడ్‌మార్క్ సన్‌గ్లాసెస్‌తో కనిపించారు.
* దృశ్యం 3 కోసం
రజనీకాంత్ ఇటీవల ‘కూలీ’ చిత్రంలో కనిపించారు. శ్రియా ప్రస్తుతం ‘దృశ్యం 3’ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
