Mahender Nekkonda SI Suspension Case
Published:
Updated: 21 Jul 2026 • 02:47 PM
ఆకేరు న్యూస్, వరంగల్: నెక్కొండ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గార్దుల వెంకన్నకు సంబంధించిన ఒక సివిల్ వివాదంలో ఎస్సై జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంలో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం కమిషనర్ ఈ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
