* కుమారుడు మురళీ కృష్ణ కన్నుమూత
ఆకేరున్యూస్ డెస్క్: దక్షిణాది ప్రముఖ గాయని ఎస్.జానకి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గాయని కె.ఎస్ చిత్ర తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మురళీ కృష్ణ జానకి కుమారుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సుప్రసిద్థ భరతనాట్య కళాకారుడు. శాస్తీయ నత్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన, పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. అంతేకాకుండా, నటనపై ఉన్న ఆసక్తితో వినాయకుడు, మ్లలెపువ్వు వంటి చిత్రాల్లో నటించారు. కన్నడ సినిమా కూలింగ్ గ్లాస్‌కు రచయితగానూ వర్క్ చేశారు. మురళీ కృష్ణకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు వర్ష, అప్సర ఉన్నారు.
