
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ లోని వ్యవసాయ మార్కెట్లో సరఫరా చేస్తున్న యూరియా కోసం మంగళవారం రైతులు వారి చెప్పులను క్యూ లైన్ లో పెట్టారు.ఒక్కరికి గాను మూడు బస్తాల యూరియా ఇస్తుండటంతో ఉదయం నుంచే చాలామంది రైతులు, మహిళలు వ్యవసాయ మార్కెట్ కు చేరుకున్నారు. ఎక్కడా యూరియా దొరక్కపోవటం, నాట్లు వేసే సమయం ఆలస్యం అవుతుండడంతో కొంతమంది రైతులు సోమవారం సెలవు దినమైనప్పటికీ,మరుసటి రోజున ఇచ్చే యూరియా కోసం మార్కెట్ కి వెళ్లి క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వచ్చారు. క్యూ లైన్లో గంటల కొద్దీ నిల్చొనే ఓపిక లేక తమ చెప్పులను వరుసలో పెట్టి పక్కన సేద తీరారు. కమలాపూర్ పోలీసుల సహకారంతో యూరియా పంపిణీ చేపట్టారు.మధ్యాహ్నం 3 గంటల వరకు యూరియా లోడ్ అయిపోవడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని, ఇంటి పనులు, వ్యవసాయ పనులు వదులుకొని రోజంతా క్యూ లైన్ లోనే వేచి చూస్తున్నామని పలువురు రైతులు డిమాండ్ చేశారు.
…………………………………