
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీనియర్ ఐఏ ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (SMITHA SABARVAL) చైల్డ్ కేర్ లీవ్ (CHILD CARE LEAVE) తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు సెలవు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిసందీప్ సుల్తానియా (SANDEEP SULTANIA) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చైల్డ్ కేర్ లీవ్ కోరుతూ స్మితా సబర్వాల్ జూలై 19 న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితాసబర్వాల్ బాధ్యతలను ప్రభుత్వం సెర్ప్ అదనపు సీఈవో పి.కాత్యాయనిదేవికి అప్పగించింది.ఇదిలా ఉండగా బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ కీలకపాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు(HARISH RAO)తో పాటు స్మితా సబర్వాల్ కు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన పిసి ఘోష్ (JUSTICE PC GHOSH) నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ హాజరై వివరణ ఇచ్చారు. ఈ నేపద్యంలో స్మితా సబర్వాల్ ఆరు నెలలు సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ వెన్నుముక సమస్యతీ బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె వెన్నుముక సమస్యతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా గురువారం ఓ పోస్ట్ పెట్టారు.
…………………………………….