* స్పృహతప్పిన పలువురు విద్యార్థులు
ఆకేరున్యూస్, జైపూర్: పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లో పొగలు వ్యాపించడంతో కొంతమంది విద్యార్థులు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించగా..అధికారులు స్పందించి ఆ కోచింగ్ సెంటర్కు సీల్ వేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో సెంటర్లో సుమారు 350 మంది విద్యార్థులున్నారు. కోచింగ్ సెంటర్ పక్కనే ఉన్న ఇంట్లోని వంటగది నుంచి గ్యాస్ లీక్ కావడం లేదా సమీపంలోని డ్రైనేజీ నుంచి విష వాయువులు వెలువడి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు, పేరెంట్స్ నిరసన తెలిపారు.
……………………………………….