Software Employee Death
* సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం
ఆకేరు న్యూస్, చిల్పూర్ : జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని గార్లగడ్డతండా పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్‌లో గల్లంతైన సాఫ్ట్వేర్ ఉద్యోగి (Software Employee Death) మృతదేహం మంగళవారం లభ్యమైంది.
రెండు రోజులుగా పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం వెలికితీశారు. పోలీసుల వివరాల ప్రకారం..
ఆదివారం రిజర్వాయర్‌లో గల్లంతైన శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళ్యాణ్ (27)గా మృతుడిని గుర్తించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో రిజర్వాయర్‌లో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి ఒడ్డుకు చేర్చారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
