Singareni Workers Bonus
* బోనస్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, తెలంగాణ : రానున్న దసరా, దీపావళి, నవరాత్రి పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.
దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని ఆయన అన్నారు. సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి కొంగు బంగారమని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని అన్నారు. దేశాభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధిలోనూ సింగరేణి కీలక భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు.
* కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం..
సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సంస్థ భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.
ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచేందుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.
* రూ.60 వేల కోట్లు విడుదల చేయాలి..
సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. సంస్థ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బకాయిలను విడుదల చేయాలని సూచించారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కృషి, అంకితభావంతో సింగరేణి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
