మంత్రి కొండా సురేఖ
* నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కొండా సురేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అక్కినేని నాగార్జున కుటుంబానికి అపకీర్తి తెచ్చే ఉద్దేశ్యం తనకు లేదని మంత్రి కోండా సురేఖ వివరణ ఇచ్చుకున్నారు. మంగళవారం రాత్రి ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. తనకు ఎవరినీ నొప్పించాలనే ఆలోచన లేదని తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది కలిగితే క్షమించాలని ఆమె కోరారు.తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. కాగా రేపు నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలపై వేసిన పరువు నష్టం పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపధ్యంలో మంత్రి కొండా సురేఖ ఒక రోజు ముందు నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం గమనార్హం.
……………………………………………………………
