
ఆకేరు న్యూస్, ములుగు: ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు కట్టించాలని తెలంగాణ ప్రజాసేన స్థాపకులు బొమ్మ కంటి రమేష్ వర్మ ప్రభుత్వం ను కోరారు. మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఇళ్లల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇల్లు స్థలాలు కేటాయించి ప్రభుత్వమే వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలి అని రమేష్ వర్మ ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల్ని పోషించుకుంటూ ఉండడానికి ఇల్లు లేక గత కొన్ని ఏండ్ల నుండి ములుగు జిల్లా కేంద్రంలో కిరాయిలు ఉంటు కిరాయిలు కట్టలేక ఇబ్బందిలు పడుతున్నమని ఆవేదన వ్యక్తంచేశారు.ములుగు జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రజలుకు ప్రభుత్వం భూమిని కేటాయించి ఇల్లు కట్టించాలని న్నారు. అదేవిధంగా కిరాయి కట్టలేక అనేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి మంత్రి సీతక్క చేతుల మీదుగా నిరుపేదకు కుటుంబానికి ఒక గుంట చొప్పున స్థలం ఇచ్చి వారికి ఇల్లు కట్టించాలని బొమ్మ కంటి రమేష్ వర్మ కోరారు.
……………………………………..