
* ఈ వ్యవహారంపై సీజేఐ సీరియస్.. జడ్జి బదిలీ
* అసలేం జరిగింది.. జడ్జి ఇంట్లో నోట్లకట్టలేంటంటే..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yeswanthvarma) ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కుటుంబ సభ్యులు అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయడంతో హుటాహుటిన జస్టిస్ ఇంటికి చేరుకున్నారు. మంటలను ఆర్పుతుండగా.. అక్కడి పరిస్థితిని చూసి సిబ్బంది షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఓ గదిలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. అవన్నీ ట్యాక్స్ పరిధిలోని డబ్బుగా అధికారులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం ఈనెల 14న జరిగింది. ఆ సమయంలో జస్టిస్ ఇంట్లో లేరు. ఈ నగదు వ్యవహారం సంచలనంగా మారింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా (Supreme Court Justice Sanjeev Khanna) ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. ముగ్గురు జడ్జిలతో కొలీజియం ఏర్పాటు చేశారు. ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సీజేఐ సారథ్యంలోని కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని.. ఆయన రాజీనామా చేయాలని కొందరు కొలీజియం సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. ఇంత డబ్బును న్యాయమూర్తి ఎలా సంపాదించాడనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జస్టిస్ యశ్వంత్ వర్మ నగదు వ్యవహారంపై రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. న్యాయమూర్తులకు జవాబుదారీతనం ఉండాలని, ఈ విషయంలో సభలో చర్చ జరగాలని జైరాం రమేశ్ (Jairam Ramesh) అన్నారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ధన్ఖడ్ అన్నారు.
…………………….