
* ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి
* రంజాన్ పండుగ చాలా గొప్ప పండుగ
* ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: మైనార్టీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని, ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం లీలా గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా ఎస్పీ శభరిష్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం సోదరులను అన్ని రంగాల్లో రాణించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని, ముఖ్యంగా పలు రంగాల్లో ప్రతిభ చాటిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, ప్రభుత్వం కలిపిస్తున్న అవకాశాలను అన్ని వర్గాల ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని, నెలరోజులపాటు ఉపవాస దీక్షలు చేయడం చెప్పుకోదగ్గ విషయమని కొనియాడారు.
………………………….