* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఆకేరున్యూస్, నర్సంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల్లో ఆనందం నింపడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి భూమి పూజ చేసి ముగ్గులు పోయడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో మాట్లాడారు.ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు.ఎస్సీ,ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు,బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మాదవరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, పెండ్యాల హరిప్రసాద్,ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
