ఆకేరు న్యూస్, హైదరాబాద్: వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, నర్సాపూర్, కాకినాడ మధ్య నడుపనున్నది.
ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఇలా..
* కాచిగూడ-తిరుపతి- ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరనుంది. మళ్లీ 17వ తేదీ 7.50 గంటలకు తిరుపతి నుంచి వెళ్తుంది.
* నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్- ఆగస్టు 18న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి బయల్దేరుతుంది. మళ్లీ ఈనెల 19న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.
* కాకినాడ టౌన్-సికింద్రాబాద్- ఆగస్టు 17న రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి.. 18న సికింద్రాబాద్కు చేరుకుంటుంది. మళ్లీ ఈ నెల 18న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుంది.
* కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్- ఆగస్టు 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరుతుంది. మళ్లీ ఈ నెల 19న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్తుంది.
———————-