
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ గా శ్రీ దేవసేన నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా కొనసాగుతుండగా.. తాజాగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు, ఇంటర్ విద్యాశాఖకు సంచాలకురాలిగా ఉన్న శృతి ఓజా ఈ నెల 16వ తేదీ నుంచి 2025 సెప్టెంబర్ 15వ తేదీ వరకు.. అంటే సంవత్సరం పాటు స్టడీ లీవ్ పై ఇంగ్లండ్ కు వెళ్లనున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో పబ్లిక్ పాలసీ లో పీజీ కోర్సు చేసేందుకు ప్రభుత్వం ఆమెకు అనుమతి ఇచ్చింది.
————————