* శ్రీలంక లో వర్ష బీభత్సం
ఆకేరు న్యూస్, డెస్క్ : శ్రీలంక ను భారీ విపత్తు ముంచెత్తింది. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణా నష్టం కూడా సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 56 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 21 మంది జాడ తెలియలేదు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా ఆపేశారు. పలు రోడ్లు మూసివేశారు. రక్షణ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లు ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న ముగ్గురిని రక్షించాయి. నేవీ, పోలీసులు బోట్లతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఈ విపత్తు శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా టీ ప్లాంటేషన్ ప్రాంతాల్లో. ప్రభుత్వం రిలీఫ్ కార్యక్రమాలు, రక్షణ చర్యలు ముమ్మరం చేసింది. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వరుస ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు శ్రీలంక ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. తీవ్రత తగ్గకపోతే రేపు కూడా సెలవు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
……………………………………….
