* శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
* మార్చి 23 నుండి 30 వరకు
* తాటికొండ, నష్కల్ ఆలయాల ముస్తాబు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు. చైత్ర శుద్ధ పంచమి సోమవారం 23 వ తేదీ నుండి ద్వాదశి సోమవారం 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పండుగ భద్రయ్య, అర్చకులు జీడి కంటి వరుణాచార్యులు తెలిపారు.
” కార్యక్రమాలు
ఈనెల 23న తొలక్కం, 24న ఆరగింపు, 25న పరమపదోత్సవం. 26న దీక్షా వస్త్రధారణ. ద్వార తోరణం. 27న గరుడ ముద్దా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. 28న అశ్వవాహన సేవ( ఊరేగింపు). 29న నిత్య హోమం. 30న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
” ఆలయాల ముస్తాబు
ప్రతి ఏటా జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ( బ్రహ్మోత్సవాల) కోసం ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. తాటికొండ కిలగుట్ట కింద ఉన్న ఆలయాన్ని, గ్రామంలో ఉన్న గుడిని రంగులతో ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. నష్కల్ వాగు ఒడ్డున ఉన్న పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి రంగులు వేసి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు.
” కరపత్రాల ఆవిష్కరణ
తాటికొండ శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కరపత్రాల తో పరిసర గ్రామాల్లో ప్రచారం చేసే ఉద్దేశంతో కరపత్రాలను శుక్రవారం కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆ కరపత్రం ఆవిష్కరించారు.
” చలువ పందిళ్ళ ఏర్పాట్లు
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నారు. త్రాగునీరు, మజ్జిగతో పాటు అన్నదాన వితరణ ఏర్పాట్లు చేయనున్నారు. సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
