* విశ్వహిందూ పరిషత్ వార్నింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పకపోతే, ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్య కుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. రాజమౌళి వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు. డైరెక్టర్ రాజమౌళి సినిమాలో తనకు ఇష్టం వచ్చినట్లుగా హిందూ దేవుళ్లపై సినిమాలు తీయడం మానుకోవాలని హెచ్చరించారు.
