స్టేషన్ ఘన్ పూర్, ఆకేరు న్యూస్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో నామినేషన్ల సమర్పణ జోరు సాగింది. 18 వార్డులకు మొదటి రోజు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కాగా రెండవ రోజు 59 నామినేషన్లు వేశారు. చివరి రోజు శుక్రవారం 123 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ 18 వార్డులకు గాను 183 నామినేషన్లు దాఖలు అయినట్లు కమిషనర్ రాధాకృష్ణ తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ తోపాటు ప్రతిపక్ష టిఆర్ఎస్, బిజెపి పార్టీ అభ్యర్థులు సైతం డప్పు చప్పులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్లు సమర్పించారు.

…………………………………………..
