Jangaon Road Accident MGM
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగల్లు గ్రామానికి చెందిన గాండ్ల రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. చాగల్లు నుండి రాంపూర్ ఇండస్ట్రీలో హమాలి పనికి బైక్ పై వెళుతున్న క్రమంలో చిన్న పెండ్యాల వద్ద బైక్ ప్రమాదవశాత్తు జారి(స్కిడ్) పడగా గాండ్ల రమేష్ తలకు, చేతులకు బలమైన గాయాలు మరియు తీవ్ర రక్తస్రావం తో ఉన్న అతని 108 స్టేషన్ ఘన్ పూర్ అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి హరికృష్ణ, పైలెట్ రాజన్న సకాలంలో స్పందించి అంబులెన్స్ లో ఎమర్జెన్సీ చికిత్స నిర్వహిస్తూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
