Station Ghanpur Bus Stand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పలు అంశాలపై బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు.
బిజెపి నాయకులతో కలిసి బస్టాండ్ సందర్శించి ప్రయాణికులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను పరిష్కారం చేయాలని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్లు, బస్సులు బస్ స్టేషన్ లోకి రావడంలేదని, డీలక్స్ బస్సుల హాల్టింగ్, తాగునీరు, మూత్రశాలలు అపరిశుభ్రం మొదలైన సమస్యలు పరిష్కరించాలని కోరారు.
అనంతరం ఆర్టిసి ఈడి, ఆర్ఎంఓ, డిఎం, కంట్రోలర్ కి వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జనగామ జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లందుల సారయ్య, ధార్మిక సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బుర్ర తిరుపతి, కిసాన్ మోర్చా జఫర్గడ్ మండల అధ్యక్షులు అబ్బరబోయిన యాక స్వామి, బూత్ అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, సకినాల కొమురెల్లి, సీనియర్ నాయకులు ముచ్చా యాదవ రెడ్డి, ఇల్లందుల యాకయ్య, మాజీ బూత్ అధ్యక్షులు తీగరపు బుచ్చయ్య, రాజారపు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
