Jeevan Reddy Congress criticism
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్
తెలంగాణలో మళ్ళీ బిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతాడని జీవన్ రెడ్డీ భ్రమ పడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కొలిపాక సతీష్ ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో సతీష్ ఇక్కడ మాట్లాడుతూ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చి మంత్రి స్థాయి వరకు తీసులివచ్చింది అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లకుండా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు వంశీ చందర్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డురి లక్ష్మణ్ తో పాటు ముఖ్య నాయకులు పార్టీలోనే ఉండాలని చెప్పిన వినకుండా పార్టీ వీడిన జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళుతున్నాడు. కేసీఆర్ మెప్పు కోసం రేవంత్ రెడ్డి పోవాలి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అనడం చూస్తుంటే జీవన్ రెడ్డికి మతి భ్రమించిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలను మోసం చేశాడని సతీష్ ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రాష్టాన్ని అప్పుల కుప్పగా మర్చిడమే గాకుండా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను అనేక ఇబ్బందులకు గురిచేసి అక్రమంగా కేసులు పెట్టించి మంత్రుల పర్యటనలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచి పోలీసు స్టేషన్లో తెల్లవార్లు ఉంచిన సంగతి మర్చిపోయారా అని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం ఫామ్ హౌస్ కు పరిమితం అని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం100 సీట్ల పైన రేవంత్ రెడ్డి నాయకత్వం లో గెలుస్తుందని ఈ విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అన్నారు.
