Ippagudem CPM door to door survey
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇప్పగూడెం లో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం చేపట్టినట్టు సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ తెలిపారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండల కార్యదర్శి మునిగెల రమేష్ హాజరై మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకొనుటకై సిపిఎం ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఈనెల 13 నుండి 16 వరకు గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలిసి వార్డులలో ఉన్న సమస్యలు తెలుసుకునుటకై పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు, ఈ సర్వేలో వచ్చిన సమస్యలపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, తోడెంగల ఐలయ్య, మంద మహేందర్, శాఖ కార్యదర్శులు నాయకులు నెలమంచ రాంరెడ్డి, దాసరి కొమురయ్య, రామగోని సతీష్, గోడిశాల యాదగిరి, సట్ల రాజు, దైద కుమార్, లింగనబోయిన కుమార్, మేదరవైన కరుణాకర్, లింగనబోయిన శ్రీకాంత్, మంద మొగిలి, అన్నెపు రాజు, నీరటి సంపత్, కాసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
