Chilpur Temple Venkateswara Kalyanam
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామిదేవస్థానము లో శనివారం శ్రీ స్వామి వారి వార కళ్యాణం ఘనంగా జరిగింది. వివిధ గ్రామాల, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు గణగోని రమేష్, గోళీ రాజశేఖర్, పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది , కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మోహన్ ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నరు. అనంతరం (ఆంధ్ర ప్రదేశ్)పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన హనుమంతరావు-సుజాత దంపతులు, హనుమకొండకు చెందిన కె.సాత్విక లు అన్నదాన వితరణ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
