Station Ghanpur chalivendram
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ మాట్లాడుతూ మండుటెండలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజేష్, అంగిడి రజిత కృష్ణ, పెసరు కృష్ణవేణి సారయ్య, బొల్లు లక్ష్మి, పొన్నం స్వరూప రాజయ్య మునిసిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
