Mirzapur lawyer murder UP
* మొరాయించిన కిల్లర్స్ బైక్
* పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానికులు
* సోషల్ మీడియాలో ఫైరింగ్ వీడియో వైరల్
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి : ఉత్తర్ ప్రదేశ్లో నడిరోడ్డుపై న్యాయవాదిని దారుణంగా హత్య చేశారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిని దుండగులు నాటు తుపాకీతో బెదిరించి పారిపోయారు. ఉత్తర్ ప్రదేశ్లోని మీర్జాపూర్ లో మార్నింగ్ వాక్ కు వెళ్ళిన న్యాయవాది రాజీవ్ సింగ్ ( 45 ) దుండగులు మాటు వేసి తుపాకీతో కాల్చి చంపారు. ఇద్దరు దుండగుల్లో ఒకరు బైక్ మీద ఉండగా మరొకరు న్యాయవాదికి చేరువగా వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. న్యాయవాది కుప్పకూలి పోవడంతో పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే బైక్ స్టార్ట్ కాకుండా మొరాయించింది. అప్పటికే ఈ హడావుడి చూసిన స్థానికులు దుండగులన పట్టుకోవడానికి ప్రయత్నించారు. తుపాకీ చూపించి దగ్గరకు వస్తే కాల్చి పారేస్తామని బెదిరిస్తూనే బైక్ స్టార్ట్ కావడంతో పారిపోయారు. ఇదంతా సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింద్.. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యాయవాది రాజీవ్ సింగ్ తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గా తెలుస్తోంది. గ్రామ సమస్యలకు సంబందించి గతంలో మృతుడికి నిందులకు మద్య గొడవలు ఉన్నట్లుగా తెలుస్తోందని, పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని మీర్జా పూర్ ఎస్సీ అపర్ణా రజత్ కౌషిక్ మీడియాకు తెలిపారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
