Pallagutta Bodrai anniversary celebrations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో బొడ్రాయి (గ్రామదేవతల) ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం శని, ఆదివారంలో ఘనంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్టించి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఆదివారం నూతన వస్త్రాలంకరణతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సర్పంచ్ ఎలగందుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ దేవస్థాన డైరెక్టర్లు రత్నాకర్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, పిఏసిఎస్ మాజీ వైస్ చైర్మన్ చిర నాగరాజు, కారోబార్ జీడి ఆనందం, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
