Srivani Gurukula 2010-11 batch Alumni Meet
* విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది
… కందికొండ రంగయ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవాణి గురుకుల పాఠశాలలో 2010- 2011 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. 15 ఏళ్ల క్రిందట విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాల పరిసరాలను స్పృశించి ఉప్పండి పోయారు. ఆనాటి మిత్రులను కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. మొదట తమతో చదువుకున్న విద్యార్థి శేఖర్, ఉపాధ్యాయుడు నవీన్ మరణానికి చింతిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రధానాచార్యులు కంది కొండ రంగయ్య మాట్లాడుతూ
1990 సంవత్సరంలో స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాల ప్రారంభించి అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేశామన్నారు. ఆనాటి విద్యార్థులు ఈరోజు ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగి స్థిరపడడం గర్వంగా ఉందన్నారు.
పాఠశాలను గుర్తుంచుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉపాధ్యాయులను సత్కరించడం అభినందనీయం అన్నారు. మీరు మీ కోసమే కాకుండా సమాజం కోసం పనిచేయాలని మంచి పౌరులుగా ఎదిగి తాము నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ఈ దేశానికి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు కందికొండ సంపత్ కుమార్, కందికొండ కుమారస్వామి, మధుసూదన్ రెడ్డి, వీరేశం, సాంబయ్య, గంగాధర్, మంజుల, మాధవి నిర్వాహకులు కుల్ల కార్తీక్, రాజేందర్, వెంకటేష్, అంగిడి శశిధర్, ప్రవీణ్, సతీష్, శ్వేత, లతోపాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
