* ఎస్ఎస్ సి బ్యాచ్ మిత్రుల ఔదార్యం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుడి కాలును పోగొట్టుకున్న పాండ్యాల శ్రీనివాస్ కి తోటి మిత్రులు రూ.1 లక్ష 1 వెయ్యి 16 ల ఆర్థిక సహాయం అందించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేట్ గ్రామానికి చెందిన పాండ్యాల శ్రీనివాస్ ప్రైవేట్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 21న హైదరాబాద్ నుండీ కర్నూలు వెళుతుండగా అదే రోజు రాత్రి 12.15 గంటలకు బస్ ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కాలు నుజ్జునుజ్జు అయింది. హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించినప్పటికీ నరం డ్యామేజ్ అయింది ఇన్ఫెక్షన్ అయి కాలును తీసివేసినారు. అతనికి భార్య , ఇద్దరూ కూతుర్లు ఉన్నారు.
విషయం తెలుసుకున్న 1992-1993 ఎస్ ఎస్ సి బ్యాచ్ మిత్రులు పాండ్యాల శ్రీనివాస్ కి ఆదివారం రూ. 101016,(ఒక లక్ష ఒక వెయ్యి పదహారు) లు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కర్ణకంటి నాగరాజ్ కుమార్, బత్తిని రవీందర్, కూరపాటి శ్రీనివాస్, బూర లింగమూర్తి, పెరుమాండ్ల వేణు, తాడగొని చంద్రశేఖర్, నల్లతీగల రవి, తొండూరు శ్రీనివాస్, తాడగొని రఘు తదితరులు పాల్గొన్నారు.
