Retired Bank Manager Donates Notebooks
* ఎఫ్ఏ నోట్స్ బహూకరించిన
– రిటైర్డ్ బ్యాంకు మేనేజర్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ ఉన్నత పాఠశాల 10 వ తరగతి విద్యార్థులకు రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్(కెనరాబ్యాంక్) ఎంఎన్ స్వామి 7 వేల విలువగల ఎఫ్ఏ నోట్ బుక్స్ ను ఒక్కొక్క విద్యార్థికి ఏడు చొప్పున బహుకరించారు.
ఈ సందర్భంగా ఎం.ఎన్. స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తనకు తోచిన సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకున్నానని, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విలువలు కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దుతాయని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ చేసిన ఎంన్ స్వామికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులందరూ ఉన్నత శ్రేణి పలితాలు సాధించి కృతజ్ఞతను చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్ర, లింగమూర్తి, రంజిత్, శ్రీనివాస్, పిడి గిరెడ్డి ప్రమోద్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మురళి, అనసూయ, సలావుద్దీన్, కృపమ్మ, సోమేశ్వరి, రవి, సువర్ణ పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
