RTC strikeTelangana
* రాక్షస ఆనందం పొందుతున్న రేవంత్
* మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ప్రయత్నం చేస్తూ అక్రమ అరెస్టులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న శ్రీనివాస్ గౌడ్ ని జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల వద్ద అరెస్టు చేసి స్టేషన్ ఘన్ పూర్ స్టేషన్ కు తరలించారు. విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శంకర్ గౌడ్ ఒక్కడి ఆత్మహత్య కాదు ఈరోజు రైతుల పరిస్థితి ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
ఒకప్పుడు తెలంగాణ గురించి సమ్మె చేసిన మేము ఇప్పుడు మా జీవితాల గురించి సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బిఆర్ఎస్ నాయకుల అరెస్టులను రాష్ట్రం గమనిస్తుందని చనిపోయిన వారిని చూడడానికి వెళుతుంటే అక్రమ అరెస్టులా అని ప్రశ్నించారు. కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ బిజెపి దోస్తీ స్పష్టమవుతుంది అన్నారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ కాంగ్రెస్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అన్నారు.
చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి 50 లక్షలు చెల్లించాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకు అధికారం ఇచ్చింది గడ్డి పీకడానికి కాదు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలనే డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, ప్రతిపక్ష నాయకులను అనగదొక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని విలీనం చేసుకొని ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి కార్మికుల డిమాండ్లను సానుకూలంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు అండగా నిలబడి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రాజయ్య హెచ్చరించారు. వారి వెంట పార్షి రంగారావు, జగన్ రెడ్డి, గణేష్, చందర్ రెడ్డి, మాచర్ల గణేష్, కౌన్సిలర్లు రాజేశ్వర్, రాజేష్, అనిల్ కార్యకర్తలు పాల్గొన్నారు.
