* ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
* ఎన్ హెచ్ పై రాస్తారోకో
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ప్రవర్తించిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ కేంద్రం బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అపారమైన జాతీయ అనుభవం ఉన్న శ్రీహరిని చంపుతానని బెదిరించిన పాడి కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు. అహంకారంతో దళితుల పట్ల, గిరిజనుల పట్ల చులకనగా మాట్లాడే నువ్వు మరో మారు నోరు జారితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజమ్మ గట్టయ్య, దేవస్థానం చైర్మన్ నీల నరసింహులు, కౌన్సిలర్లు సంగీత రమేష్, సంపత్ రాజు, కృష్ణవేణి సారయ్య, రజిత కృష్ణ మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్ నాయకులు బూర్ల శంకర్, కొలిపాక సతీష్, నీరటి ప్రభాకర్, నీల సోమయ్య, ఎడ్ల రాజు, గట్టు ప్రశాంత్, డైరెక్టర్ మారపాక వసంత్, సింగపురం దయాకర్. మోహన్ నాయక్, సింగపురం వెంకటయ్య, జోసఫ్, మామిండ్ల శ్రీనివాస్, అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.
