Government Land Encroachment Complaint
* రిజిస్ట్రేషన్ రద్దు చేయించండి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 46 పై అక్రమ కబ్జా, శాశ్వత కంచ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ శివుని పెళ్లి మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం (ప్రస్తుత మున్సిపాలిటీ పరిధి) శివునిపల్లి మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు బుధవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామ శివారులోని సర్వేనెంబర్ 45 ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 46 లోని 28 గుంటల ప్రభుత్వ భూమి బూర్ల శంకర్ అనే వ్యక్తి అక్రమంగా అమ్మి వేరే వ్యక్తులకు 2019లో రిజిస్ట్రేషన్ చేయించారని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇట్టి ప్రభుత్వ భూమి కబ్జా, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో జూన్ 2025 ఆర్డీవో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనితో కబ్జా దారులు 2025 ఖరీఫ్ లో సాగు మానుకొని 2026 రబి సీజన్లో సాగు చేయడంతోపాటు ప్రస్తుతం అట్టి 28 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 46 కు శాశ్వత కంచి ఏర్పాటు చేసి 28 గుంటలు కబ్జా కాకుండా చూడడంతోపాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 4991/ 2019ని రద్దు చేయించి భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తి బూర్ల శంకర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులకు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
